AUDIO TELUGU BIBLE

Call Us:+919248653277

  • bootstrap carousel example
1 2
slider javascript by WOWSlider.com v7.7

Our Testimony :



                  దేవుని నామమునకు స్తోత్రము. నా పేరు సత్యన్నారాయణరెడ్డి. మాది తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామము. మా పూర్వీకుల పారంపర్యాచార ప్రకారము విగ్రహారాధన కుటుంబములో పుట్టిన నేను, మా తండ్రిగారి ఉద్యోగరీత్యా ధవిళేశ్వరములో ఉండెడివారము. ఆ గ్రామములోగల గోదావరినది రామ పాదాల రేవులో స్నానం చేసి, సమీపంలో గల అగస్తశ్వీరాలయం, కొండపైనగల లక్ష్మీ జనార్ధన స్వామి ఆలయంలో అభీషేకాలు అర్చనలు, మరియు ప్రతీ గురువారం సాయిబాబా ఆలయంలో పూజలు కార్తీక మాసంలో చాలా నిష్టగా ఉపవాసాలు ఉంటూ ఆ కార్యక్రమాలన్నిటిని శ్రద్ధగా ఆచరించెడివాడను. ఇలా ఉండగా మా నాన్నగారు అనారోగ్యరీత్యా అనేక హస్పిటల్స్ లో ఉండగా క్త్రెస్తవ సువార్తీకుల ద్వారా క్రీస్తును గురించి వినటం జరిగినది. కాని క్త్రెస్తవ్యం మీద ఉన్న ద్వేషం తో తెలిసిన బ్రహ్మణులను కలిసి ఆయా విషయములు చర్చించినప్పటికి సరియైన సమాధానం లభించక పుస్తకములను ఆశ్రయించటం జరిగినది.
                  స్వామి వివేకానంద ప్రభోదరత్నాకరము మొదటి పేజీలో బ్రహ్మను తెలుసుకోలేం. పరమ పితను మనం తెలుసుకోజాలము. పరమ పుత్రుణ్ణి మాత్రమే తెలుసుకోగలం. మానవ రూపంలోనే క్రీస్తుమూలంగా మాత్రమే బ్రహ్మ సృష్టికర్త ని కాంచగలం అనే సత్యాన్ని మరియు బృహదారణ్య కోప నిషత్తులో దేవుని ఆత్మయే భూలోకంలో పుత్రునిగా జన్మంచి, ఆ కుమారుని ద్వారానే పాపము పరిహరింపబడును అంతేగాక దివ్యఖురాన్ లో కూడా ఏసుని దేవుని కుమారుడుగాను దైవాత్మ స్వరూపుడుగాను ఉంది. ఆయా గ్రంధాలలో నిక్షిప్తమై ఉన్న ప్రవచన పురుషుడు క్రీస్తు ఏసు నా యందు విశ్వాసముంచు ప్రతీవాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి యున్నాను యెహను 12.46 నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రీ యెద్దకు రాడు యెహను 14.6 పాపములను క్షమించుటకు భూమిమీద మనుష్య కుమారునికి అధికారం కలదు.మత్తయి 9.6 అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును అర్పించడానికి వచ్చెను మత్తయి 20.28 నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కల్గి ఉంటారని యెహను 8.12 బోధించి ఆయన తనకు తానుగా ప్రవచనముల ప్రకారము సిలువ బలియజ్ఞమునకు సిద్ధపడి మన పాపముల నిమిత్తము తన రక్తమును సిలువలో చిందించి మనకు పాప విమోచన కలుగ చేసెను. అనే సత్యాన్ని గ్రహించి అప్పటి నుండి క్త్రెస్తవునిగా కొనసాగుతున్నాను.

                                                                                                                              ధన్యవాదాలు !

 

 

 

© Copyright 2014. Designed by sekharsoftech@gmail.com

HTML Templates